మంచిర్యాల విజయక్రాంతి : మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ చున్నంబట్టీ వాడ 100 ఫీట్ల రోడ్డు వద్ద చాకలి ఐలమ్మ 129వ జయంతిని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నైజాం పాలనలో దొరలు, భూస్వాములు, దేశ్ముకుల దౌర్జన్యాలు, దోపిడీ, వెట్టిచాకిరికి, వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంతో, భూస్వాముల భూములు పేదలకు పంచి, వెట్టిచాకిరి, దోపిడీని వ్యతిరేకిస్తూ అడుగడుగునా భూస్వాముల గుండెల్లోగుబులు పుట్టిస్తు పోరాడిన దీరవనిత అని కొనియాడారు.
ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత, మహిళామణులు వారీ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్య మంత్రి హైదరాబాదులోని కోటి మహిళా వర్షిటికి ఐలమ్మ పేరును నామకరణం చేయడం యావత్ రజక జాతి గర్విస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంగం లక్ష్మణ్, సంగెపు ఎల్లయ్య, కొమురయ్య, తడూరి శంకర్, రాష్ట్ర నాయకులు తంగళ్లపల్లి తిరుపతి, కొలిపాక రమేష్, నేతకాని సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామి, బొడ్డుపలి రాజన్న, మాజీ కౌన్సిలర్ పడాల రామన్న, తదితరులు పాల్గొన్నారు.