వర్ధంతిలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు
విజయక్రాంతి న్యూస్‌నెట్‌వర్క్, సెప్టెంబర్ 10: భూమి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన చాకలి ఐలమ్మ నే టి తరానికి ఎంతో స్ఫూర్తి అని కలెక్టర్లు, ఎ మ్మెల్యేలు అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని మంగళవారం అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.