calender_icon.png 4 April, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు చాకలి ఐలమ్మ చిత్రపటం ఆవిష్కరణ

02-04-2025 12:00:00 AM

హాజరు కానున్న వివిధ రంగాల ప్రముఖులు

ముషీరాబాద్, ఏప్రిల్ 1: (విజయక్రాంతి) : కోఠిలోని మహిళా యూనివర్సిటీకి ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా నామకరణ చేసిన నేపథ్యంలో ఆ ధీర మహిళ వీరనారి చాకలి ఐలమ్మ పోరా ట జీవితాన్ని ప్రతిబింబించే విధంగా నిలువెత్తు చిత్రపటాన్ని దర్బార్ హాల్లో ఆవిష్కరిస్తున్నట్లు రెవల్యూషనరీ ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఆర్ డబ్ల్యూహెచ్‌ఐ) తెలిపింది.

ఈ మేరకు మంగళ వారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో  ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి.హరికాంత్, ఉపాధ్యక్షుడు కె.చరణ్, కార్యద ర్శి డాక్టర్ సౌజన్య కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.

ఈనెల 2న ఉద యం11 గంటలకు విశ్వ విద్యాలయం లో వైన్-చాన్సలర్ ప్రొఫెసర్ సూర్యధనంజయ, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు బి.నర్సింగ రావు, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిధులుగా పాల్గొంటారని చెప్పారు.

చాకలి ఐలమ్మ పోరాటం యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిందని, భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆహర్నిషలు కృషి చేసిన ఆమె పోరాట స్ఫూర్తితో యువత ముందు కు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి, వీసీ సూర్య ధనంజయలకు ధన్యవాదాలు తెలిపారు.