calender_icon.png 29 September, 2024 | 3:07 PM

చాకలి ఐలమ్మ ప్రజాపోరాటాలకు స్ఫూర్తి

26-09-2024 03:29:56 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజ యక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సం దర్భంగా ఆమె పోరాట పటిమను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్మరించు కున్నారు. దొరల గడీల అరాచకాలకు, నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

తెలంగాణ పోరాట యోధురాలిగా చాకలి ఐలమ్మ జీవిత చర్రిత ఎన్నో ప్రజాపోరాటాకుల స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేసుకు న్నారు. ఆమె పోరాటాలను స్మరించుకుం టూ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

జయం తి ఉత్సవాలకు బీసీ సంక్షేమ శాఖ నుంచి నిధులు విడుదల చేశామని తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారని, ఆమె మనుమరాలును మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా నియమిస్తూ గౌరవించుకుంటున్నామని వెల్లడించారు. ఐలమ్మకు ఘన నివాళి అర్పించారు.

ఐలమ్మ జీవితం ఆదర్శం: కేసీఆర్

తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. అణిచివేతకు గురైన బలహీనవ ర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, అస్థిత్వ ఉద్యమంలో, స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో, పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావ డం వెనుక ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ తెలిపారు.

చిట్యాల ఐలమ్మ ఆకాంక్షలకు అనుగుణంగానే పదేండ్లలో తెలంగాణ రాష్ర్ట తొలి ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ, ప్రగతి కార్యాచరణను అమలుచేసిందని చెప్పారు. ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఆదర్శమని పేర్కొన్నారు.

ఐలమ్మ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారంగా నిర్వహించాలని నిర్ణయించి అమలుచేసిందని గుర్తుచేశారు. బలహీన వర్గాలు, నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయడమే ఐలమ్మకు మనం అర్పించే ఘన నివాళి అని తెలిపారు.