జోష్ సినిమాస్‌తో 2009 టాలీవుడ్‌లో అడుగుపెట్టి మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్‌గా దూసుకు పోతున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ఏమాయ చేసావే, మజిలీ, ప్రేమమ్, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న చైతూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ మూవీ తండేల్ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు.
పోస్టర్‌లో రగ్గడ్ అవతార్‌లో కనిపించిన నాగ చైతన్య తన చిరునవ్వుతో క ట్టిపడేశారు. చైతు సముద్రం దగ్గర ఫిషింగ్ బోట్ మీద నిలబడి కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. చం దూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నా రు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవిశ్రీ ప్ర సాద్ సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్. ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.