calender_icon.png 4 January, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి

01-01-2025 05:38:17 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అధనపు ఎస్పీగా బి. చైతన్య రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2022 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన చైతన్య రెడ్డి గ్రే హౌండ్ లో అధనపు ఎస్పీగా పని చేసి ఇటీవల కామారెడ్డి ఎఏస్పీగా బదిలీ చేశారు. బుధవారం కామారెడ్డి పోలిస్ కార్యాలయంలో చైతన్య రెడ్డి ఎఏస్పిగా బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి డిఎస్పి నాగేశ్వర్ రావు ఇటివల డిజిపి కార్యాలయంకు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దానితో కామారెడ్డి ఇంచార్జీ డిఎస్పీగా నియమించగా చైతన్య రెడ్డి భాధ్యతలు స్వీకరించి సబ్ డివిజన్ అధికారులతో సమీక్షించారు. ఈ సంధర్బంగా అధికారులు చైతన్య రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం చైతన్యరెడ్డి, జిల్లా ఎస్పీ సిందుశర్మతో పాటు ఇతర అధికారులను మర్యాధపూర్వకంగా కలిసారు.