calender_icon.png 9 January, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్టీపర్పస్ పార్కు పనులు పరిశీలించిన సుడా చైర్మన్

08-01-2025 06:31:31 PM

నాణ్యతలో లోపాలున్నాయి.. ఇప్పటికైనా సరిదిద్దాలి

హెరిటేజ్ భవనం మల్టీ పర్పస్ పాఠశాలను కాపాడాలి

కాంట్రాక్టర్, అధికారులకు పలు సూచనలు చేసిన సుడా చైర్మన్

కరీంనగర్ (విజయక్రాంతి): స్మార్ట్ సిటీ పనులలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం దాదాపు పదకొండు కోట్లతో పనులు చేపట్టిన మల్టీ పర్పస్ పార్కు పనులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. నాణ్యతలో లోపాలున్నాయని ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు అధికారులకు సూచించారు. ఎవరి ఒత్తిడి ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని గతంలో చేసిన పొరపాట్లు చేస్తే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో నడువదని చూస్తూ ఊరుకోమని కాంట్రాక్టర్ ను అధికారులను హెచ్చరించారు. హంపి తియెటర్ వెనక వారసత్వ కట్టడం మల్టీ పర్పస్ పాఠశాల దెబ్బతిని ఉందని దాన్ని కొంత తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సుడా చైర్మన్ వెంట కార్పోరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, భూమాగౌడ్, సరిల్ల ప్రసాద్ నాయకులు ఎండి తాజ్, ఆర్ష మల్లేశం, కాశేట్టి శ్రీనివాస్, మెండి చంద్రశేఖర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దిగారి తిరుపతి, కుర్ర పోచయ్య, దన్న సింగ్, జక్కుల మల్లేశం, జీడి రమేష్, మీరాజ్, బషీర్, సుదర్శన్, ఎల్లారెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఈఈ స్మార్ట్ సిటీ ఏఈ తదితరులు పాల్గొన్నారు.