నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ మాజీ మంత్రి వేణుగోపాల చారి తదితరులు బుధవారం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్టు వారు తెలిపారు.