calender_icon.png 10 January, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాలెండర్ ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్

09-01-2025 07:33:28 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో గురువారం ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో డెమొక్రటిక్ టీచర్ ఫెడరేషన్ (DTF) క్యాలెండర్ ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కోట రాజాబాబు, కాటారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వామన్ రావు, మాజీ జడ్పీటీసీ గుడాల అరుణ, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, మండల మైనారిటీ అధ్యక్షులు అస్రర్ ఖురేషీ, కాంగ్రెస్ నాయకులు నాగరాజు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.