హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఓఆర్ చట్టంపై ప్రత్యేకంగా చర్చించారు. అలాగే, ధరణి సమస్యలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. భూసంస్కరణ చట్టం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం, ధరణిలోని పార్ట్-బీ, పార్ట్-ఏలోని భూముల వివరాలను డిప్యూటీ సీఎంకు కోదండ రెడ్డి వివరించారు. సమావేశంలో భూమి సునీల్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.