హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 8న రవీంద్రభారతిలో జేఎన్‌హెచ్‌ఎస్ ఇంటి స్థలాల అప్పగింత కార్యక్రమంపై, రాష్ట్రంలోని మిగతా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమానికి సంబంధించిన విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం.