calender_icon.png 31 October, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ కిట్స్... ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ది బెస్ట్ కాలేజ్

13-09-2024 07:16:10 PM

విద్యార్థినికి ఉద్యోగం ఉపాధి కల్పించడమే యజమాన్యం ధ్యేయం

కిట్స్ మహిళలలకే ఒక ప్రత్యేక గుర్తింపు

విద్యార్థిలకు అవగాహన సదస్సు కల్పించిన కీట్స్ విద్యా సంస్థ చైర్మన్  డా. నీల సత్యనారాయణ

కోదాడ,(విజయక్రాంతి): కిట్స్ కాలేజ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ది బెస్ట్ కాలేజ్ అని కోదాడ కిట్స్ మహిళ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో ఉన్న కిట్స్ కాలేజీలో బిటెక్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు అవగాహన సదస్సు కల్పించారు. అనంతరం మాట్లాడుతూ... ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఉపాధి కల్పించే విధంగా విద్యను అందించడమే కళాశాల ధ్యేయమన్నారు.కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొట్ట మొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అని రెండు దశాబ్దాల నుండి వందలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకుని శుక్రవారం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.

కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డా. సిహెచ్ నాగార్జున రావు మాట్లాడుతూ... కళాశాలలోని వసతులను వినియోగించుకొని ఉన్నత స్థాయి కి ఎదగాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.గాంధీ మాట్లాడుతూ... కళాశాలలో అర్హత కలిగిన విద్యార్థులతో పాటు ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ, వంటి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.కళాశాల పూర్వ విద్యార్థి ని మర్రి వెంకట రమణ, ప్రభుత్వ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ మరియు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ లో ఉన్నతాధికారిగా ఎంపిక అయిన  సందర్బంగా కళాశాల చైర్మన్ అభినందనలు తెలిపి ఘనంగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కృష్ణారావు, హెచ్ఓడీలు ఎన్ రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, జనార్ధన్, ఎజాజ్  అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.