calender_icon.png 17 November, 2024 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లు

17-11-2024 01:22:57 AM

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలోని నాలుగు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. జనగామ జిల్లాకు మారుజోడు రాంబాబు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బొంగుమారి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండ జిల్లాకు మహ్మద్ అజీబ్ ఖాన్, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎండీ అవైస్ ఉర్ రహ్మాన్‌ను నియమిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు విడుదల చేశారు.