calender_icon.png 27 December, 2024 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ ను సన్మానించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

07-10-2024 03:15:38 PM

మంథని (విజయ క్రాంతి): మంథని పట్టణంలోని తమ్మ చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి విచ్చేసిన మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ ను మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్  మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ఐటీ, పరిశ్రమలు మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రమా, వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, మత్స్యశాఖ పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య, జిల్లా డైరెక్టర్ పోతరవేన క్రాంతి కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు చొప్పకట్ల హనుమంతు, కాయిత సమ్మయ్య, గుండా విజయలక్ష్మి, నక్క నాగేంద్ర, ఏఎంసి మాజి చైర్మన్ అజింఖాన్, మాజీ ఎంపిటిసి పోలు శివ, నాయకులు పేరవేన లింగయ్య, సబ్బని సమ్మయ్య, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.