calender_icon.png 16 April, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం దళారులకు విక్రయిస్తే నష్టపోతారు..

16-04-2025 12:41:08 PM

చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ

మునుగోడు,(విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం విక్రయించాలని దళారులకు అమ్ముతే రైతులు నష్టపోతారని చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ(Chandur Market Committee Chairman Narayana) అన్నారు. బుధవారం మండలంలోని బీరెల్లి గూడెంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

రైతులు కొనుగోలు కేంద్రాల నిబంధనల ప్రకారం వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. కేంద్రం నిర్వాహకులు రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని సరైన తేమశాతం ఉన్నచో మిల్లులకు తరలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని పద్మజ ,ఏపియం డి మైసేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సైదులు,సిసి శ్రీనివాస్, ఏఇఓ నర్సింహ, గ్రామ సంఘం అధ్యక్షురాలు ఊర్మిళ, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు