calender_icon.png 25 November, 2024 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాయుతిలో కుర్చీలాట!

25-11-2024 03:07:37 AM

  1. ముఖ్యమంత్రి ఎవరన్నదీ ఇప్పటికీ సందిగ్ధమే
  2. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేతలు
  3. 26న సీఎం ప్రమాణం! 
  4. ఇప్పటికే వేర్వేరుగా భాగస్వామ్య పక్షాల భేటీ
  5. నేడు సీఎం ఎంపికపై కూటమి సమావేశం

ముంబై, నవంబర్ 24: మహారాష్ట్రలో తిరుగులేని విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. సోమవారమే ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీలు ప్రమాణం చేసే అవకాశముందని ఇప్ప టికే శివసేన (షిండే వర్గం) నేత దీపక్ సర్కార్ వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి ఎవరన్నదీ ఇంకా స్పష్టత రాలేదు.

కాగా, మహారాష్ట్ర శాసనసభ గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో ఆలోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు మహాయుతిలోని భాగస్వామ్య పక్షాలు తమ తమ శాసనాసభ పక్ష నేతల ఎన్నికను పూర్తి చేశాయి. 

సీఎం ఎంపికపై నేడు భేటీ

శాసనసభ పక్ష నేత ఎంపిక కోసం మూడు పార్టీలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో బాంద్రాలోని ఓ హోటల్ లో సమావేశమయ్యారు. ఈ భేటీలో షిండేను తమ పక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముంబైలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్సీపీ చీఫ్ అజిత్‌ప వార్‌ను తమ పక్షనేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

కాగా, ముంబైలోని దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సీఎం ఎంపికపై చర్చించడానికి మహాయుతి ఎమ్మెల్యేలంతా కూటమిగా సోమవారం భేటీ కానున్నారు. బీజేపీ అధిష్ఠానంతో సంప్రదింపుల తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. 

ఇద్దరి మధ్యే పోటీ

సీఎం విషయంలో కూటమిలో ప్రస్తుతం అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశముంది. దీంతో సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్ ముందున్నారు. ఏక్‌నాథ్ షిండేకు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు అప్పగించి ఫడ్నవీస్‌నే సీఎం చేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు శివసేనతో ఒప్పం దం కుదుర్చుకునే అవకాశముందని తెలుస్తోంది.

మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా సీఎం పోస్టును ఆశిస్తున్నారు. ఫలితాల అనంతరం ఆయన మాట్లా డుతూ.. ఎక్కువ సీట్లు గెలిచి పార్టీకే పదవి దక్కుతుందని చెప్పలేమన్నారు. శివసేన కార్యకర్తలు కూడా షిండేనే మరోసారి సీఎం చేయా లని పట్టుబడుతున్నారు. షిండేకు ఉన్న క్లీన్ ఇమేజీతో పాటు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి చేసిన సాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు.