calender_icon.png 2 May, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో తిష్టవేసిన పలువురు అక్రమాలకు పాల్పడుతున్న చైన్‌మెన్లు

09-04-2025 12:14:56 AM

  1. దళిత చైతన్య సంఘం అధ్యక్షుడు ముప్పిడి నవీన్‌కుమార్

  2. హైదరాబాద్  సిటీబ్యూరో, ఏప్రిల్ 8(విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలో పలువురు చైన్‌మెన్లు తిష్టవేసి అక్రమాలకు పాల్పడుతున్నారని దళిత చైతన్య సంఘం (డీసీఎస్) అధ్యక్షుడు ముప్పిడి నవీన్‌కుమార్ ఆరోపించారు.

  3. వారిపై పూర్తి ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో 40, 50గజాల్లో 4, 5 అంతస్తుల భవనాలను కడుతున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. 

  4. వారి నుంచి చైన్‌మెన్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, పలువురు విధులకు హాజరు కాకుండా జీతాలు పొందుతున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్యకార్మికులకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు పెట్టిన అధికారులు వీరికి ఎందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ పెట్టడంలేదని ప్రశ్నించారు. సమావేశంలో దళిత చైతన్య సంఘం నాయకులు మధుసూధన్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.