calender_icon.png 24 February, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళను బెదిరించి పుస్తెలతాడు చోరీ

24-02-2025 08:04:39 PM

దొంగను పట్టుకున్న స్థానికులు..

కొండపాక: మహిళాను కత్తితో బెదిరించి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ చేసిన ఘటన కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. కుకునూరు పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిమ్మారెడ్డిపల్లి పరిధిలోని సార్లపల్లి గ్రామానికి చెందిన మల్లం నరసింహులు ఇంట్లో శుభకార్యానికి వారి బంధువులు నంగునూరుకు చెందిన సుగుణ ఆదివారం వచ్చారు. సోమవారం ఉదయం తిరిగి వెళ్లేందుకు సార్లవాడ నుంచి కొమురవెల్లి కమాన్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను వెంబడిస్తూ ఒక వ్యక్తి కత్తి చూపి బెదిరిస్తూ ఆమె మెడలో నుంచి పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యారు. దాంతో ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు విషయాన్ని గమనించి చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కుక్కునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.