calender_icon.png 23 December, 2024 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్

21-12-2024 12:34:22 PM

రెండు గంటల్లో నిందితుడి అరెస్ట్ 

ఎల్బీనగర్: వనస్థలిపురంలో శుక్రవారం రాత్రి చైన్స్ స్నాచింగ్ పాల్పడిన నిందితుడిని పోలీసులు రెండు గంటల్లో పెట్టుకున్నారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్ర సీమ కాలనీలో ఉన్న  పద్మావతి బ్యాంకు  వద్ద  కారులో నుంచి దిగుతున్న క్రమంలో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. బాధితురాలు వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాల  ఆధారంగా 2 గంటలలో నిందితుడుని పట్టుకొని  బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్ కు తరలించారు.