calender_icon.png 25 December, 2024 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

25-12-2024 01:29:38 AM

వికారాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొగల ము ఠాను సీసీఎస్ వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జిల్లా ఎప్సీ నారాయణ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బొంరాస్‌పేట్, వికరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను గుర్తుతెలియని వ్యక్తులు స్నాచింగ్ చేశారు.

అలాగే కుల్కచర్ల పీఎస్ పరిధిలో కూడా స్నాచింగ్‌కు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదన్నారు. వరుస చైన్ స్నాచింగ్‌లు జరగడంతో మూఠాను పట్టుకునేందుకు ఆయా పీఎస్‌లోని పోలీసు అధికారులతో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు బలవంతయ్య, అన్వర్ పాషా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినవారు ఎండీ జావిద్, మరో మైనర్ బాలుడిగా గుర్తించి వారిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జావిద్‌పై తెలంగాణలో 150కి పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.