calender_icon.png 21 April, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైన్ స్నాచర్ అరెస్ట్

13-12-2024 12:57:32 AM

పటాన్‌చెరు, డిసెంబర్ 12: ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు పటాన్‌చెరు క్రైమ్ సీఐ రాజు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. నారాయణ్‌ఖేడ్ ప్రాంతం నిజాంపేట్‌కు చెందిన బుద్దం దత్తురాజ్(24) ఈనెల 3న ఇంద్రేశం గ్రామంలో భాగ్యమ్మ అనే మహిళ మధ్యాహ్నం సమయంలో తన కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకె ళ్తుండగా వెనక నుంచి వచ్చి మెడలో నుంచి చైన్ లాక్కొని బైక్‌పై పారిపోయాడు.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం ఉదయం ఇస్నా పూర్ చౌరస్తాలో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా ఇంద్రేశంలో చైన్ స్నాచింగ్ చేసింది తానేనని నిందితుడు ఒప్పుకున్నట్లు చెప్పారు.