06-07-2024 12:31:56 AM
గుజరాత్ (సూరత్), జూలై 5: సోషల్ మీడియా సెన్సేషన్‌గా నిలిచిన ‘డాలీ చాయ్‌వాలా’ గురించి మీకు తెలుసు కదా.. అచ్చం అలాగే మరో టీ వెండర్ తన శ్రావ్యమైన గొంతుతో పాటలు పాడుతూ టీ అమ్మి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో అందరూ అతడిని ‘సింగింగ్ చాయ్‌వాలా’గా పిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణం డుమాస్ ప్రాంతంలో విజయ్‌భాయ్ పటేల్.. గత కొన్నేళ్లుగా టీ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడు టీ తయారు చేసి కస్టమర్లకు ఇచ్చే సమయంలో అలనాటి ప్రముఖ బాలీవుడ్ సింగర్ కిషోర్ కుమార్ పాటలను పాడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ ఫొటోగ్రఫర్ విరాల్ భయానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌భాయ్ పటేల్ టీ చేస్తూ పాటలు పాడే వీడియోను షేర్ చేయగా గంట వ్యవధిలోనే ఆ వీడియోకు దాదాపు 2 లక్షల వ్యూస్ వచ్చాయి.