మీరా మానెక్.. చూడటానికి అచ్చం పక్కింటి అమ్మాయిలాగే కనిపిస్తుంది. తన ఆలోచనలు అందరికన్నా కాస్త భిన్నంగా ఉంటాయి. అంతర్గత భావోద్వేగాలను చక్కగా వ్యక్తీకరిస్తుంది. సుక్ష్మమైన అంశాలను అద్భుతంగా వర్ణిస్తుంది. అంతే కాదు తాను అనుభూతి చెందిన ప్రతిదీ తనకు స్ఫూర్తే అంటూ రచనలు చేస్తుంది. తన రచనలు అన్నీ కూడా భారతీయ వంటకాలే. మీరా చిన్ననాటి జ్ఞాపకాలను అద్భుతంగా కథల రూపంలో వ్యక్తపరిచింది. తన రచనలకు ప్రేరణ వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, చాయ్ అంటూ చెబుతున్నది మీరా. తాజాగా మీరా ‘ది బుక్ ఆఫ్ చాయ్’ లో ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రస్తావించారు. మీరా రచించిన ఈ పుస్తకంలో దాదాపు 60కి పైగా వంటకాలను, మనోహరమైన కథలు రాశారు.
మీరా పుట్టి, పెరిగిందంతా యూకేలోనే. కానీ మన భారతీయ మూలాలను మరిచిపోలేదు. మీరా అమ్మగారిది గుజరాత్. చిన్నతనంలో అమ్మమ్మ ఉదయాన్నే చేసే చాయ్ తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది. చాయ్ కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, వంటల్లోకి వాడే మసాలాలు మీరాకు చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యేవి. యూకేలో బ్రూ తాగుతూ పెరిగినా.. ఇండియాలో చేసే చాయ్ మాత్రం నా ఫెవరేట్ అంటుంది. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు వెనుక ఉన్న విలువలు చాలా గొప్పగా కనిపిస్తాయి.
భారత దేశానికి వస్తూ, పోస్తూ ఉన్న క్రమంలో తన ఆలోచనలు కూడా మారుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే చాయ్‌లో కలుపుకొని తాగే సుగంధ ద్రవ్యాలు, మసాలాలు ఆమెకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. మొత్తంగా సుగంధ ద్రవ్యాలు ఆమె ఆలోచనలను మార్చేశాయి. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందకు పైగా కేఫ్‌లకు, హోటళ్లకు మసాలాలు సరఫరా చేస్తున్నది. ఆ ప్రేరణతో ‘ది బుక్ ఆఫ్ చాయ్’ (హచెట్ ఇండియా) రచించారు.
సుగంధ ద్రవ్యాలపై పరిశోధన..
మీరా సుగంధ ద్రవ్యాలపై ప్రత్యేకంగా పరిశోధన చేసి ఆయుర్వేదంపై ఒక పుస్తకాన్ని రాసింది. అంతేకాదు ప్రతి మసాలా అద్భుతమైన ఔషధంలా పని చేస్తున్నది అని వివరిం చారు. సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియ కు ఎలా సహాయపడతాయి? కడుపులో మంటను ఎలా తగ్గిస్తాయి? అవి మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపిస్తాయి? మనస్సును తేలికగా చేయడంలో వాటి పాత్ర ఏంటి? మరెన్నో విషయాలను మీరా తన పుస్తకంలో రాసుకొచ్చారు. చాయ్‌కు ఎప్పటికైనా ఆదరణ ఉంటుంది. చాయ్‌ని స్నాక్స్‌తో పాటు తీసుకోవడం వంటి కథనాలను పుస్తకంలో గొప్పగా రాశారు. ఆమె రాసిన కథల్లోని జ్ఞాపకాలు, భావోద్వేగాలు పాఠ కులకు సులభంగా కనెక్ట్ అవుతాయి.
చాయ్ ఒక పరిమళం..
పాలు, సుగంధ ద్రవ్యాలు కలిపి తయారు చేసిన ఉకారో అనే పానీయాన్ని చక్కెరతో కలిపి తాగుతూ ఎలా పెరిగిందో పుస్తకంలో చక్కగా రాసుకొచ్చింది. “చాయ్‌ని నా వ్యాపారం చేయాలని నేను ఎప్పు డూ ఆలోచించలేదు, ప్రత్యేకంగా ప్లాన్ కూడా చేయలేదు” అని అంటున్నది. యూకేలోని మీరా బ్రాండ్ ద్వారా సుగంధ ద్రవ్యాల ను, మసాలాలను కేఫ్‌లు, రెస్టారెంట్‌లకు కూడా సప్లుచేస్తున్నది. “నేను చాయ్‌పై పుస్తకం రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అది కూడా నా జీవితంలో చాలా సహజంగా జరిగిపోయింది” అంటున్నా రు. పుస్తకంలో కేవలం చాయ్ గు రించి మాత్రమే కాకుండా భారత దేశంలోని సుగంధ ద్రవ్యాల గురిం చి, చిన్ననాటి జ్ఞాపకాలు.. గుజరాత్‌లోని ఒక గ్రామంలో తన అమ్మమ్మ (నాని)తో కలిసి పెరిగిన అనుభవాలను పంచుకున్నది. మీరా అమ్మ మ్మ ఉదయాన్నే చాయ్ తయారు చేసే విధానం ఆమెను ప్రత్యేకంగా ఆకట్టుకున్నదని చెప్తున్నది.
“నేను ఈ పుస్తకం రాయడానికి చాలా సమయం పట్టింది. చాయ్, సుగంధ ద్రవ్యాల గురించి పరిశోధన చేయడానికి యూకేలోని క్యూలో ఉన్న రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లోని ఆర్కైవ్‌లను అనేక సార్లు సందర్శించి.. వాటికి సంబంధించిన పుస్తకాలను చదివిన తర్వాత రాయ డం మొదలు పెట్టాను. ఇష్టమైన దాన్ని వ్యక్తీకరించడానికి పెద్దగా సమ యం పట్టదు కానీ మనం రాసే ప్రతిదీ పరిశోధనాత్మకంగా ఉండాలనేది నా కోరిక” అంటున్నది మీరా. ఇది మీరా రాసిన మూడో పుస్తకం కావడం విశేషం.