calender_icon.png 23 January, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరమరాల మసాలా @ లండన్

23-10-2024 01:13:17 AM

లండన్ వీధుల్లో మరమరాల చాట్ అమ్ముతున్న బ్రిటిషర్

వైరల్‌గా మారిన వీడియో

లండన్, అక్టోబర్ 22: చాట్, చిరుతిండ్లకు పెట్టిన పేరైన ఉత్తర భారతదేశంలో ఎంతో ఫేమస్ అయిన జల్మూరీ(మరమరాల మసాలా)ని ఓ బ్రిటిషర్ లండన్ వీధుల్లో ఎంతో ఉత్సాహంగా తయారు చేసి అమ్ముతున్న ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో.. అతడు అచ్చం మన వాళ్లలా మరమరాల చాట్ అమ్ముతూ కనిపించాడు. ఓ గిన్నెలో మరమరాలు వేసుకొని ఉల్లిపాయలు, కొత్తమీర, దోస, కీర, మసాలా చాట్ వేసి కలిపి పేపర్ పొట్లంలో చుట్టి ఇస్తుండటం, దీనికి తోడు అతను తన బండిపై ‘ఝల్మురి ఎక్స్‌ప్రెస్’ అని రాసి ఉండటాన్ని చూసిన నెటిజన్లు అతడి పనితీరుకి ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించి ఓ వ్లాగర్ చేసిన పోస్టుపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ లండన్‌లో మరమరాల మసాలానా.. వావ్’.. ‘ వీడియో చూస్తేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి’.. ‘తెళ్లవాళ్లు మన రుచులకు ఫిదా’ అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.