calender_icon.png 10 March, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ ఎస్సైగా సిహెచ్ భరత్ రెడ్డి

10-03-2025 07:57:50 PM

కొండాపూర్: కొండాపూర్ మండల ఎస్సైగా సిహెచ్ భరత్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ జిల్లా నుంచి కొండాపూర్ మండలం ఎస్సైగా ఇక్కడకు వచ్చారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన హరిశంకర్ గౌడ్ హైదరాబాద్ కు బాదిలీపై వెళ్లారు. ఈ సందర్బంగా ఎస్సై భరత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్కు నిర్భయంగా వచ్చి పోలీస్ సహాయం పొందవచ్చన్నారు. శాంతిభద్రతల విషయంలో కొండాపూర్ మండల ప్రజలు సహకరించగలరన్నారు. యువత కచ్చితంగా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.