ముఖ్య అతిథులుగా హాజరైన అదనపు ఎస్పీ సంజీవ రావు
గుమ్మడిదల, జనవరి 10: స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని గుమ్మడిదల మండల కేంద్రంలో సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యజరమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు ఎస్పీ సంజీవ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడ పోటీలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలపై యువత మక్కువ చూపాలన్నారు. సీజేఆర్ ట్రస్ట్ క్రీడలను నిర్వహించడం అభినందనమన్నారు. ట్రస్ట్ ఛైర్మెన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో తన ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెళ్ళదించారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, మండల తహసీల్దార్ గంగా భవాని, ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి, ఎంపిడిఓ ఉమాదేవి, ట్రస్ట్ వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి,మాజీ జడ్పీటిసి లు కోలన్ బల్ రెడ్డి, కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎంపిటీసీ వెంకటేశం గౌడ్, మంద భాస్కర్ రెడ్డి ఎల్లయ్య ఉదయ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు యువజన సంఘం నాయకులు స్థానిక ప్రజలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.