calender_icon.png 22 January, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూడాల సమ్మె విరమణ

20-09-2024 01:57:01 AM

కోల్‌కతా, సెప్టెంబర్ 19: పశ్చిమ బెంగా ల్‌లో కొన్నిరోజులుగా నిరసన చేపడుతున్న జూడాలు ఆందోళన విరమించారు. సీఎం మమతతో రెండుసార్లు భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి అత్యవసర సేవల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. మమత వైద్యుల డిమాండ్లను అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు స్పష్టం చేశారు.  

సందీప్ రిజిస్ట్రేషన్ రద్దు

ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న మెడికల్ కౌన్సిల్ సందీప్‌కు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది.