calender_icon.png 29 November, 2024 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారంలోగా ధ్రువపత్రాలు అందజేయాలి

29-11-2024 01:43:20 AM

హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): హైదారా బాద్ జిల్లాలోని వివిధ ఎన్జీవోలు, శిశువిహార్ సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు బర్త్, క్యాస్ట్, ఆర్ఫాన్, ఆధార్ తదితర ధ్రువీకరణ పత్రాలను వారంలోగా జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టర్ ఆఫీస్‌లో వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దురిశెట్టి మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ సంస్థల్లో సుమారు 1,500 పిల్లలు ఉన్నారని, వారికి ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేకంగా ఏడు శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

క్యాంపు సందర్భంగా పిల్లలకు భోజనం, నీరు, వైద్య సౌకర్యాలు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ముకుంద రెడ్డి, డీఆర్‌వో ఈ వెంకటాచారి, జీహెచ్‌ఎంసీ సీఎంవో డాక్టర్ పద్మజ, డీడబ్ల్యూ అక్కేశ్వరరావు, డీసీపీవో శ్రీనివాస్, ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆర్డీవో సాయిరాం, ఎస్‌ఈఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.