మంచిర్యాల, ఆగస్టు 6 (విజయక్రాంతి): హత్య కేసుల్లో విచారణ జరిపి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించి జీవితఖైదు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులకు తెలంగాణ డీజీపీ జితేందర్ మంగళవారం ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ ఎం రమేష్, మంచిర్యాల జిల్లా మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే శశిధర్‌రెడ్డి, శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మోహన్, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్ ఉన్నారు.