జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో పిలవనున్న టీఎస్‌పీఎస్‌సీ
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): గ్రూప్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను త్వరలోనే నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలవనున్నారు. కమ్యూనిటీ, నాన్ క్రిమీలేయర్ (బీసీలకు), పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్, స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్స్ (ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు), రిజర్వేషన్ కలిగి ఉంటే దానికి సంబంధించిన ధ్రువపత్రాలు, ఏజ్ రిలాక్సేషన్, విద్యార్హత సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని అభ్యర్థులను సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఏదైనా ధ్రువపత్రాన్ని సమర్పించకపోయినా ఆ అభ్యర్థులను పరిగణన లోకి తీసుకోబోమని టీఎస్‌పీఎస్‌సీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదల చేసిన విషయం తెలిసిందే.