calender_icon.png 29 January, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియా సిగలో మరో మణిహారం

25-09-2024 06:20:20 PM

 నైబర్‌హుడ్ ఛాలెంజ్‌ పోటీలో బల్దియా కు ఎక్సలెన్స్ సర్టిఫికేట్

బెంగళూరు, ఇండోర్, జబల్ పూర్, కొచ్చి లతో పాటు జిడబ్ల్యూఎంసీ కు దక్కిన స్థానం

ఎక్సలెన్స్ సర్టిఫికేట్ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మేయర్

హనుమకొండ: బల్దియా సిగలో మరో మణిహారం చేరింది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి గృహ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యుఏ)ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో స్మార్ట్ సిటీ నగరాలకు సంబందించి జరిగిన సమావేశంలో గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ (ఎన్ ఎన్ సి)పోటీల్లో ఇతర నగరాలతో  పోటీపడి  ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి(టాప్)-5 నగరాలకు  కేంద్ర మంత్రిత్వ శాఖ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అందజేసినట్లు బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర తెలిపారు. ఎన్ ఎన్ సి పోటీల్లో బెంగళూరు, ఇండోర్, జబల్పూర్, కొచ్చి నగరాలతో వరంగల్ మహా నగరం టాప్ -5 లో చోటు దక్కడం పట్ల నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడానికి కృషి చేసిన  జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులను అభినందించారు.

ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ.. సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ మన నగరానికి రావడం మనందరికీ గర్వకారణం అని  దేశ వ్యాప్తం గా కేంద్ర ప్రభుత్వం గతం లో 100 స్మార్ట్ సిటీ నగరాలను ఎంపిక చేయడం జరిగిందని తిరిగి అందులో నుండి ఫేజ్ -1 లో భాగం గా నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ పేరు తో నిధులు అందజేసి  నిర్ణీత సమయం లో పార్కు లను ఏర్పాటు చేయడానికి పోటీలు నిర్వహించిన నేపద్యం లో నగర వ్యాప్తం గా ఎం హెచ్ నగర్ లో చిట్టి పార్క్ 56 గంటల రికార్డ్ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

దీనితో పాటు  క్రిస్టియన్ కాలనీలో నైనర్హుడ్ పార్క్, కరిమాబాద్ లో గుండు బావి, శ్రీనగర్ కాలనీలో సేన్సోరి పార్క్ ఎల్ పి స్కూల్ లో సైన్స్ పార్క్, అంబెడ్కర్ కూడలి వద్ద బుద్ధ ప్లాజా  లను నిర్దేశిత సమయంలో ఏర్పాటు చేసి డాక్యుమెంటేషన్ ను ఎంపిక కమిటీ కి పంపించడం జరిగిందని వాటిని పరిశీలించిన కమిటీ దేశవ్యాప్తంగా 5 నగరాల్లో బల్దియా కు ఎక్సలెన్స్ సర్టిఫికేట్(అవార్డు) ఎంపిక చేసిందని ఫేజ్ -2 లో భాగం గా నగరం లో  మరి కొన్ని పార్కులను అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేసే అవకాశం ఉన్నట్లు మేయర్ తెలిపారు. ఈ సందర్భం గా బుధవారం ఢిల్లీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మిషన్ డైరెక్టర్ రాహుల్ కపూర్ చేతుల మీదుగా ఎక్సలెన్స్ సర్టిఫికేట్(అవార్డు) స్వీకరించినట్లు ఎస్ ఈ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏ ఈ కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.