14-02-2025 01:30:26 AM
సంవత్సర కాలం నుంచి తిరుగుతున్నా సర్టిఫికెట్‌కు నోచుకోని వైనం
కామారెడ్డి, ఫిబ్రవరి 1౩ (విజయ క్రాంతి), దివ్యాంగుని గా ఆర్వత ఉన్న సదరమూ సర్టిఫికెట్ అందించడం లేదని ఓ దివ్యాంగుడు అధికారుల చుట్టూ ఏడాదికాలంగా తిరిగిన సదరం సర్టిఫికెట్ అందించకపోవడంతో నిరసనకు దిగిన ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట లో చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దివ్యాంగులుగా అన్ని అర్వతలు ఉన్న సదరం క్యాంపు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు సార్ అంటూ ఓ దివ్యాంగుడు బిబిపేట మండల కేంద్రనికి చెందిన నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా బీబీ పేట మండల కేంద్రానికి చెందిన కొమిరే నరేందర్ మాట్లాడుతూ సదరం క్యాంపు కు సంవత్సరం నుండి తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని సదరం సర్టిఫికెట్ ఇవ్వడం లేదని వాపోయారు,కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నిర్వహించే సదరం క్యాంపుకు గత సంవత్సరం నుండి పది సార్లు వెళ్లడం జరిగిందని తెలిపారు, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నానని , సదరరం క్యాంపుకు వచ్చినప్పుడల్లా ఆటో ద్వారా రావడం జరుగుతుందని ,ఆటో ద్వారా వచ్చినప్పుడల్ల 1000 రూపాయలు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వస్తే కూడా ఓటిపి రావడంలేదని, లేదంటే సర్వర్ రావడం లేదని అనుకుంటూ వెనక్కి సిబ్బంది అధికారులు పంపిస్తున్నారని తెలిపారు.
సదరం క్యాంపుకు ఎన్నిసార్లు వచ్చిన నాకు మాత్రం న్యాయం జరగడం లేదని, సదరం క్యాంప్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కొమీరె నరేందర్ ఆవేదన వెలిబుచ్చారు, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తనలాంటి దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇప్పించగలరని బిబిపేట గ్రామానికి చెందిన కొమిరే నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నా పరిస్థితి గోరంగా ఉంది నాకు తండ్రి లేడు, తండ్రి మరణించాడని, అమ్మనే దగ్గరుండి చూసుకుంటుందని , సదరం క్యాంపుకు రావాలంటే నరకం కనిపిస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే న్యాయం చేయగలరని విజయ క్రాంతి తో కోరారు. అధికారులు స్పందించి సదరం సర్టిఫికెట్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు.