calender_icon.png 23 February, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతలచెరువుకోటలో 13వ శతాబ్దం నాటి విగ్రహాలు

23-02-2025 12:00:00 AM

చింతలపాలెంలో లభించిన కాకతీయ కాలపు శాసనం

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాం తి): సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం(మల్లారెడ్డిగూడెం)లోని ఎర్రకుంటతం డా, చింతలచెరువుకోటలో శిథిలావస్థలో ఉన్న ఆలయంలో తెలంగాణ చరిత్రకారుల బృందం సభ్యులైన ఎల్లేటి చంటి సోదరులు కొన్ని విడివిడి విగ్రహాలను గుర్తించారు.

వీరు తెలిపిన వివరాల ప్రకారం ఆలయ ప్రాంగణంలో పడిఉన్న 5 అడుగుల ఎత్తయి న గులాబీ రంగు రాతి విగ్రహాన్ని అష్టభుజ వీరభద్రుడిగా గుర్తించినట్లు చెప్పారు. అక్కడే మూడురాతి సలపల మధ్య నిలబెట్టిన సతిశిలలో వీరుడు, అతడి సతికి సంబంధించిన అర్ధశిల్పాలు లభించినట్లు వెల్లడించారు.

శైలిని బట్టి ఈ సతిశిల 15వ శతాబ్ధానికి చెందినదిగా గుర్తించారు. చింతలపాలెం మండల కేంద్రంలో కాకతీయానంతర కాలం నాటి 13వ శతాబ్దానికి చెందిన శాసనం లభించినట్లు పేర్కొన్నారు. ఈ శాసనం మీద 10 పంక్తుల తెలుగులిపి, తెలుగుభాష పదాలు ఉన్నట్లు చెప్పారు.

శాసనంలోని తెలుగు వాక్యాలు

‘స్వస్తిశ్రీ శక వరుషంబులు, (1219) హేమళంబి సంవత్సర, వైశాఖ శు.5 గు ప్రాంపేట సమ, ఊరి నడిమి మల్లినాథనిది, (ప)..మ అంమంబడిని గద్దెనా..., ...డిలఈ విగుము ఇచ్చిరి 11, ..లనయోర్మధ్యే దానా, ... నుపాలనం 1 దానస్వర్గ, ...వాప్నోతి పాలనాదచ్చు, ... పదం 11’ లాంటి తెలుగు పదా లున్నాయి.

ఈ శాసన సారంశం ‘శక సం. 1219 హేమలంబి వైశాఖ శుద్ధ పంచమి రోజున అంటే క్రీ.శ.1297 ఏప్రిల్ 27(శనివారం)రోజున ప్రాంపేట ఊరి మధ్యలో ఉన్న మల్లినాథుని పూజాదికాలు దీపం, అమ్మపడి (అమ్ముపడి) నైవేద్యం కోసం గద్దె భూమిని దానం చేశారు’ అని వివరించారు.