సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
ముంబై: భారత స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన ఫామ్‌ను దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగిస్తున్నాడు. సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీలతో కదం తొక్కిన తిలక్ తాజాగా దేశవాలీ టోర్నీలోనూ శతకంతో అదరగొట్టాడు. తిలక్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీతో మెరిసి వేలానికి ఒక్క రోజు ముందే తన పవర్‌ను చూపించాడు.
గ్రూప్ మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. తిలక్ (151) అదరగొట్టాడు. 67 బంతుల్లోనే శతకం సాధించిన తిలక్ టీ20ల్లో 150 ప్లస్ స్కోరు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అనంతరం మేఘాలయా 15.1 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది.
గూప్-ఇ లో గోవాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 26 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. శ్రేయస్ (130 నాటౌట్) భారీ సెంచరీ సాధించాడు. అనంతరం గోవా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులకు పరిమితమైంది.