ఏర్పాటుకు బర్మింగ్‌హామ్ యూనివర్సిటీతో ఒప్పందం
ప్యాకేజీ రంగంలో పర్యావరణ హిత సాంకేతికత వాడాలి..
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): శీతల రవాణా వ్యవస్థ కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లోని నోవా హోటల్‌లో గురువారం కోల్డ్ చైన్ అన్ బ్రోకెన్ 2024లో భాగంగా సుమారు 350 మంది గ్లోబల్ లీడర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కోల్డ్ చైన్ మేనేజ్‌మెంట్ భవిష్యత్తుతో పాటు పర్యావరణ అనుకూల లాజిస్టిక్స్ పరిష్కార మార్గాల కోసం బర్మింమ్‌హామ్ విశ్వవిద్యాలయంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రవాణా, విద్యారంగానికి ఎంతో తోడ్పాటునిస్తుమందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించ డంలో కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. వస్తు రవాణా వ్యవస్థ నిలదొ క్కుకునేలా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరగా పాడై పోయే ఆహార వస్తువులను శీతల రవాణా వ్యవస్థ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. స్థానికంగా శీతల నిల్వ వ్యవస్థలు, వ్యాక్యూం ఇన్స్‌లేటెడ్ కంటెయినర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా 14 శాతం ఆహార ఉత్పత్తులు వ్యర్థమవుతున్నాయని పేర్కొన్నారు.
పరిశ్రమలు ప్యాకేజీకి పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. శీతల కంటెయినర్లను, వ్యాక్యూం ఇన్స్‌లేటెడ్ రవాణా సదుపాయాలు పెంపొందించాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. సదస్సులో కోల్డ్ చైన్ ఛైర్మన్ సతీశ్ లక్కరాజు, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, గ్లోబల్ లీడర్స్ మనీష్ అగ్నిహోత్రి, మిల్టన్ డి లా పాజ్, కల్యాణ్ వీ శివలెంక, మనోజ్ సింగ్, పీ బాలసుబ్రహ్మణియన్, రాధారమణన్ ఫణికర్ పాల్గొన్నారు.