28-01-2025 01:26:02 AM
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)కి త్వరలో కొత్త చీఫ్ రానున్నారు. దీనికి సంబంధించి కేంద్రం తాజాగా దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత చీఫ్ మాధవి పురీ బచ్ మూడేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగియనుంది.
ఆమె 2022 మార్చి 2న బాధ్యతలు చేపట్టారు. ఈనేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ దరఖాస్తులు కోరింది. ఫిబ్రవరి 17వ తేదీని గడువుగా నిర్దేశించింది. పదవీకాలం చేపట్టిన తర్వాత గరిష్ఠంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చేవరకు ఈ పదవిలో ఉండాల్సి ఉంటుందని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.