calender_icon.png 17 January, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న కొత్తగూడేనికి కేంద్రబృందం

17-01-2025 01:20:32 AM

* ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని పరిశీలించనున్న అధికారులు

* వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేం  విమానాశ్రయ స్థల పరిశీలనకు ఈ  23న కేంద్ర బృందం పర్యటించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20నే కేంద్ర బృందం పర్యటించాల్సి ఉన్నా, స్వల్ప మార్పుల నేప  23న వారు జిల్లాకు రానున్నట్లు చెప్పారు.

జిల్లా  గ్రీన్ ఫీల్డ్ విమనాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుందన్నారు. ఈ బృంద సభ్యులు పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. ఇప్పటికే కొత్తగూడెం, పా  పరిసర ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు ని  భూములను గుర్తించినట్లు చెప్పారు. అక్కడ సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, తాజాగా కేంద్ర మంత్రి రామ్మో  నాయుడుకు లేఖ రాయడంతో సర్వేకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ బృందంలో  ఏరో ప్లానింగ్ ఇంజనీర్ అబ్దుల్ అజీజ్, ఆర్కెటిట్ మహ్మద్ సఖీబ్, ఆపరేషన్స్ ఇంజినీర్ ప్రశాంత్ గుప్తా, సీఎన్  దివాకర్, ఇంజినీర్ మనీశ్ జోన్వాల్, ఎఫ్‌పీడీ ప్రవీణ్ ఉన్నికృష్ణన్ వస్తున్నట్లు తు  వివరించారు. జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నట్లు చెప్పారు. విమానాశ్రయ ఏర్పాటుతో కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. వేలాది   యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.