calender_icon.png 24 February, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరులో కేంద్ర బృందం తనిఖీలు

24-02-2025 12:16:48 AM

గ్రామీణ అభివృద్ధి పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను 

తనిఖీ చేసిన కేంద్ర బృందం అధికారులు 

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : పాలమూరులో పలు మండల కేంద్రాలలో కేంద్ర బృందం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సక్రమంగా ఉపయోగించడం జరిగిందా ?  లేదా ? అనే కోణాల్లో 7th కామన్ రివ్యూ మిషన్ టీం సభ్యులు ప్రత్యేకంగా పరిశీలించారు.

హన్వాడ, భూత్పూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన వాటర్ షెడ్ లతోపాటు వివిధ పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం జిల్లా అదన కలెక్టర్ శివేంద్ర ప్రతాప్‌తో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.