calender_icon.png 22 January, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్పక్ రైలు ఘటనపై స్పందించిన సెంట్రల్ రైల్వే

22-01-2025 08:22:13 PM

మహారాష్ట్ర,(విజయక్రాంతి): జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్(Pushpak Express)లో మంటలు చెలరేగాయని పుకార్లు రావడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో ట్రైన్ చైన్ లాగి ఆపేశారు. అనంతరం ట్రాక్ మీదకు దిగి పట్టాలు దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్(Karnataka Express) రైలు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 40 మందికి గాయలైట్లు సమాచారం. ఈ దుర్ఘటన జల్‌గావ్‌లోని పరండా స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై సెంట్రల్ రైల్వే అధికారులు స్పందించింది. లక్నో నుండి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు సాయంత్రం 5 గంటలకు జల్గావ్ స్టేషన్ నుండి బయలుదేరింది. 

ప్రయాణికులు చైన్ లాగడంతో లఖ్ నవూ-ముంబై ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగిందన్నారు. రైలు ఆగాక ఒక బోగీ నుంచి కొందరు ప్రయాణికులు దిగారని, మరో ట్రాక్ దాటుతున్న ఆ సమయంలో, అదే ట్రాక్‌పై బెంగళూరు నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న కర్ణాటక బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై నిలబడి ఉన్న ప్రయాణికులను ఢీకొట్టిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన ప్రయాణికులకు తక్షణ చికిత్స అందించడానికి భూసావల్ స్టేషన్ నుండి అంబులెన్స్ లు పంపించామని సెంట్రల్ రైల్వే తెలిపారు. ఘటనాస్థలికి విపత్తు సహాయక రైలు బయలుదేరిందని, అక్కడ  పోలీసులు, రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.