calender_icon.png 3 October, 2024 | 2:41 PM

పేదలపై సీఎం ప్రతాపం: కిషన్ రెడ్డి

03-10-2024 11:32:05 AM

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి.. పేదలపై ప్రతాపం చూపుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని ఆపాపని సీఎంకు లేఖ కూడా రాశానని చెప్పారు. హైదరాబాద్ లో 70 శాతం డ్రైనేజీ నీళ్లు మూసీలోకి వెళ్తాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మూసీని సుందరీకరణ చేస్తే డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి వెళ్తాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరామన్నారు. డ్రైనేజీ సమస్య తీర్చకుండా సుందరీకరణ చేయడం అనాలోచిత చర్య అన్నారు. మూసీకి ఇరువైపుల ముందు రిటైనింట్ వాల్ కట్టండని సూచించారు. త్వరలో మూసీ సుందరీకరణ చేసుకోవచ్చు అన్నారు. పేదలు ఎవరి హయాంలో ఇళ్ల నిర్మించుకున్నారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడే ఇళ్ల నిర్మాణం జరిగిందని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచించిందన్న కిషన్ రెడ్డి ప్రజల  నుంచి వ్యతిరేకత రాగానే మూసీ సుందరీకరణపై వెనక్కి తగ్గిందన్నారు. డ్రైనేజీ, తాగునీరు కలిసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.