calender_icon.png 8 November, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైలుకు పంపారు గుర్తందా సీఎం గారు: బండి సంజయ్

08-11-2024 01:33:36 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజీపడ్డాయి

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల పేరుతో కాంగ్రెస్ నేతలు హంగామా చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజీపడ్డాయని బండి సంజయ్ తెలిపారు. జన్వాడ ఫాంహౌస్ కేసులో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజీ పడ్డాయని స్పష్టం చేశారు. బీజేపీకి తావులేకుండా చేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఇప్పుడు లేదు.. ఇక ముందు ఉండదు అని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ అభ్యర్థులు దొరకట్లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో  కేసీఆర్ కుమారుడిని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో విశ్వసనీయత ఉన్న నాయకుడు హరీశ్ రావు మాత్రమేనన్నారు. నీ బిడ్డ పెళ్లికి వెళ్లకుండా జైలుకు పంపారు గుర్తందా సీఎం గారు.. నిన్ను జైలుకు పంపిన వారితో రాజీ పడుతున్నారా?  అని బండి సంజయ్ ప్రశ్నించారు. రేవంత్, కేటీఆర్ మధ్య ఒప్పందం దృష్ట్యా కేటీఆర్ ను అరెస్టు చేయట్లేదని సంజయ్ వ్యాఖ్యానించారు. రేవంత్, నేను ఒక్కటేనని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది.. నేను, రేవంత్ ఒక్కటేనని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పండని సంజయ్ డిమాండ్ చేశారు.