calender_icon.png 27 January, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకులను ప్రైవేటీకరింబోమని 2005 బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలి

26-01-2025 01:09:28 AM

భారత బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం

ముషీరాబాద్,(విజయక్రాంతి): దేశంలో జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరింబోమని 2005 బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, ఉద్యోగ, కార్మి వ్యతిరేక విధానాలను పాలకులు విడనాడానట్లుతై ఉదృతమైన పోరాటాలు, సమ్మెలు చేపట్టడానికి బ్యాంకింగ్ ఉద్యోగులు వెనకాడబోరని ఆయన హెచ్చరించారు. పాలకులు అవలంభిస్తున్న ఆర్థిక విదానాలన్నీ ప్రజా, ఉద్యోగ, కార్మి వ్యతిరేకంగానే ఉన్నాయని, బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న ఈ కొత్త తరహా ప్రమాదాలకు వ్యతిరేకంగా వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార, గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు ఐక్యంగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు శనివారం కాచిగూడలోని కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వర్ రావు హాల్ (మాడం అంజయ్య హాల్)లో రెండురోజుల పాటు జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంక ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీటీబీఈఎఫ్) 30 త్రై వార్షిక మహాసభలను వెంకటాచలం ప్రారంభించారు. సభలో ముఖ్య అతిధిగా నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బాబు మాథ్యూస్ (బెంగళూరు), ఆలిండియా ప్రోగ్రెసీవ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ యుగల్ కిషోర్ రాయలు హాజరైయ్యారు. అనంతరం సీహెచ్ వెంకటాచలం ప్రారంభోపన్యాసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటికరించడమంటే ప్రజలు పొదుపు చేసిన దాదాపు రూ. 280 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటీకరించడమేనన్నారు. ఈ సమావేశంలో  ఏపీటీబీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి, ఏఐబీఈఏ కార్యదర్శి బీఎస్ రాంబాబు, ఏఐబీఈఏ జాతీయ సంయుక్త కార్యదర్శి వంక ఉదయ్ కుమార్, ఏపీటీబీఈఎఫ్ సంయుక్త కార్యదర్శి పీవీ కృష్ణారావు, డిప్యూటీ జనరల్ సెక్రెటరి సమద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.