calender_icon.png 30 April, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం

30-04-2025 05:03:43 PM

న్యూఢిల్లీ: కులగణనపై కేంద్ర ప్రభుత్వం(Central govt) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister Ashwini Vaishnaw) మాట్లాడుతూ, “రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈరోజు నిర్ణయించింది” అని అన్నారు. జనాభా లెక్కింపు ప్రారంభించడానికి వైష్ణవ్ తేదీని ప్రకటించలేదు. ప్రతి దశాబ్దానికి ఒకసారి నిర్వహించే జనాభా సర్వే 2021లో జరగాల్సి ఉంది, కానీ మహమ్మారి, సాంకేతిక, రవాణా అడ్డంకుల కారణంగా ఆలస్యం అయిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (Central Consumer Protection Authority) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

"రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని ఈరోజు నిర్ణయించింది" అని కేంద్ర మంత్రి అశివిని వైష్ణవ్ ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అన్నారు. అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన కుల గణన అశాస్త్రీయంగా ఉందని అశ్వీని వైష్ణవ్ అన్నారు.  ఎన్డీఏ పాలిత బీహార్‌తో సహా అనేక రాష్ట్రాలు ఇప్పటికే కుల గణన జరిగిందని చెప్పారు. బీహార్ కుల సర్వే స్వతంత్ర భారతదేశంలో అన్ని కులాలను విజయవంతంగా లెక్కించిన మొదటిదని పేర్కొన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో ఓబీసీలు(OBC)లు 63.13శాతం, ఎస్సీలు (SC) 19.65శాతం,  ఎస్టీలు( ST)1.68శాతం ఉన్నారని తేలింది.

"ఉన్నత" కులాలు జనాభాలో 15.52శాతం ఉన్నట్లు తేలింది. జనవరి 19న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కులాల ఆధారంగా ప్రజల సమగ్ర డేటాబేస్‌ను రూపొందించే లక్ష్యంతో ఒక కసరత్తును ప్రారంభించింది. ఏప్రిల్ 11న కర్ణాటక క్యాబినెట్ ముందు ఉంచిన సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే నివేదిక రాష్ట్రంలోని 5.98 కోట్ల మంది జనాభాలో 1,351 కులాలు, ఉప-కులాలను గుర్తించింది. కుల జనాభా గణనగా ప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని వివిధ కులాల ఉప-సమూహాలు లెక్కించబడ్డాయి. లింగాయతుల్లో 91 ఉప-కులాలు, వొక్కలిగలలో 49 ఉప-కులాలు నమోదు చేయబడ్డాయి. ముస్లింలను 100 ఉప-కులాలుగా వర్గీకరించగా, క్రైస్తవులను 58గా వర్గీకరించారు. బ్రాహ్మణుల కంటే ఒకటి తక్కువ, వీరిలో 59 ఉప-కులాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయతుల్లో, వొక్కలిగలు 21.3 శాతం ఉన్నారని సర్వేలో తేలింది. అంతకుముందు, ఈ రెండు ఆధిపత్య కులాలు రాష్ట్ర జనాభాలో దాదాపు మూడో వంతు వరకు ఉన్నాయని వాదనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టిన విషయం తెలిసిందే.