calender_icon.png 30 October, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం

11-08-2024 04:53:43 PM

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్

యాదాద్రి భువనగిరి: కే0ద్రంలో అధికారంలో గల బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ పేర్కొన్నారు. ఆదివారం ఆవాజ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులలో రెండో రోజున ముఖ్య అతిథిగా హాజరై ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాల్లో రూ.49,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. దేశంలో 30 కోట్ల జనభ ఉన్న ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కేవలం 3000 కోట్లు మాత్రమే కేటాయించారని, వారి సంక్షేమం కోసం 3000 కోట్లు మాత్రమే కేటాయించారని ముస్లిం మైనార్టీలు అంటే ప్రభుత్వ పేదలు తమకు ఏం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వెనుకబడిన మైనార్టీల అభివృద్ధి కోసం పది శాతం బడ్జెట్, రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిన ముస్లిం మైనార్టీలు గొడ్డు మాంసం తింటున్నారు. దీంతో హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మైనార్టీల ఇండ్లను కూల్చారని జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నిర్ణయం ప్రకారం తప్పు నిర్ధారణ కాకముందే శిక్ష వేయకూడదు. కానీ తప్పు నిర్ధారణ చేయకుండానే ముస్లిం మైనార్టీల ఇళ్ళను కూల్చడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. 

ముస్లిం మైనార్టీల పేదల కోసం కొంతమంది ముస్లిం పెద్దలు  వందల ఎకరాల భూములని వక్స బోర్డ్ కు ఇచ్చినరు  ఆ భూమిని ముస్లిం మైనార్ట్ పంచకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ స్థానిక ఆర్డీవోలకు అప్పజెప్పాలని అలాంటి భూములను పరిశీలించాలని  సూచించడం ఆ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడమే ఒక రకమైన కుట్ర  అని వక్స్ బోర్డ్  భూములు వక్స్   ట్రిపుల్ కు అధికారాలు లేకుండా చేస్తున్నదని ముస్లిం మైనార్టీలు బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న Muslim minority వ్యతిరేక విధానాలపైన  ఉద్యమాలు చేయాలని వారు అన్నారు.