22-03-2025 12:01:11 AM
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి
మునుగోడు, మార్చి 21 : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను అటకెక్కించి.. రాష్ట్ర ప్రజలకు పంగనామాలు పెట్టిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని విమర్శించారు.
రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యంగౌడ్, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, జనార్దన్ రెడ్డి, బొబ్బల మురళి మనోహర్రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, భూతరాజు శ్రీహరి, అన్నేపర్తి యాదగిరి, ఏనుగు వెంకట్ రెడ్డి, బోడ ఆంజనేయులు, రావిరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.