03-03-2025 01:39:00 AM
మహబూబ్‌నగర్, మార్చి 2 (విజయ క్రాంతి) : కేంద్ర ప్రభుత్వం మందుల ధరలను విపరీతంగా పెంచి కార్పొరేట్లకు యాజ మాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల వెల్లి కురుమూర్తి అన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం రోజు మెడికల్ రిప్స్ జిల్లా జనరల్ బాడీ సమావేశం కామ్రే డ్ మల్లికార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సామాన్య ప్రజలు వాడే మందుల ధరలు అందుబాటులో లేకుండా కార్పొరేట్ ఫార్మా కంపెనీలకు దేశ సంపదను మొత్తం కట్టబెట్టి, శ్రమజీవులకు వచ్చే రోగాలు వారి నుండి కాపాడే మందుల ధరలను 100% పెంచే రకంగా కంపెనీలకు అనుమతించడం మోడీ వ్యవహారం, ప్రజల బాధలు రోగాల బారిన పడిన ప్రజలు మందులు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మందులు ధరలు తగ్గించాలని ,కేంద్ర బడ్జెట్ ను సవరించాలని, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బహుముఖ పోరాటాలకు సిద్ధం కా వాలని వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ రీప్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శోభన్, మల్లికార్జున్, భాను, రాఘవేందర్, శ్రీకాంత్, అమరేందర్, నవీన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు