calender_icon.png 8 January, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్రం

02-01-2025 03:48:43 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రకటించింది. ఖేలేరత్న(Khel Ratna), అర్జున్(Arjuna), ద్రోణాచార్య(Dronacharya) అవార్డులను ప్రకటించింది. నలుగురికి భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు(Major Dhyan Chand Khel Ratna Award)ను కేంద్రం ప్రధానం చేయనుంది. ఈ ఏడాది 32 మంది క్రీడాకారులకు అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులను ప్రకటించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్(Dommaraju Gukesh), షూటింగ్ లో ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్(Manu Bhaker), పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్(Harmanpreet Singh), పారాలింపిక్స్ స్వర్ణ పతకం విజేత ప్రవీణ్ కుమార్(Praveen Kumar)లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) 2025 జనవరి 17వ తేదీన ఖేల్ రత్న అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈనెల 17న రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన 32 మందిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి అర్జున అవార్డు ప్రకటించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన జీవాంజ దీప్తి పారాలింపిక్స్ లో కాంస్యం గెలిచింది. రన్నర్ జ్యోతి యర్రాజీకి అర్జున అవార్డు అందుకొనున్నారు.