22-03-2025 12:00:00 AM
మహబూబాబాద్. మార్చి 21 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల అభివృద్ధికి 2.5 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మీ రెడ్డి సురేందర్ తెలిపారు.
శుక్రవారం గూడూరు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేరెడ్డి సురేందర్ హాజరై మాట్లాడుతూ గూడూరు మండల 39 గ్రామపంచాయతీలకు అంతర్గత రోడ్ల అభివృద్ధి కోసం నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు కోట్ల యాభై లక్షల నిధులు మంజూ రు చేయడం జరిగింది అని అన్నారు.
ఆ నిధులతో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ,రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయి నిధులుతేలేక పోయిన సీసీ రోడ్డు శంకుస్థాపనలలో నాయకులు పోటీపడుతూ టెంకాయలు కొడుతున్నారని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారెడి తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు.
బీసీ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని కానీ బీసీ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగపరమైన విధానాలతో ముందుకు పోవడం లేదని అన్నారు.. బీసీలను మరోసారి మోసం చేసే కుట్రగా ఉందని అన్నారు. గ్రామాల్లో పాలన పడిక వేసిందని కాంగ్రెస్ నాయకుల్లో ఉప్పరు షర్వాణి- అందరు పర్షని అన్నట్టుగా ఉంది అని స్వయంగా నిండుసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని అన్నారు.
రైతులకు బోనస్ పడతాయని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు... ఈ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకునే నాధుడే లేరు అనీ బోరుమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండబోయిన మల్లేష్ యాదవ్, చలుపూరి శ్రీశైలం, బత్తుల లక్ష్మణ్, కోరే అనిల్, పాండవుల మల్లయ్య, చల్ పూరి రాజు, బురుగు సాయికుమార్, యశ్వంత్ , దేవ్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.