calender_icon.png 10 March, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి

05-03-2025 07:56:41 PM

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డిసెబుల్ రిహాబిటేషన్.. 

సెంటర్ లో దరఖాస్తుల స్వీకరణ... 

ఎల్బీనగర్: వికలాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆదేశాల మేరకు సరూర్ నగర్ లోని  డీడీ ఆర్ సీ భవన్ లో వయోవృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల పిల్లలకు నిర్వహించిన అసెస్ మెంట్ క్యాంప్ ను బుధవారం కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, రాధా ధీరజ్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల పిల్లలు, వయోవృద్ధులతో మాట్లాడి.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం వికలాంగుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని  వారికి అవసరమైన పరికరాలు, వాహనాలు, ఆర్థిక సహాయం అందించేందుకు ఆర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా చేయూతనందిస్తామని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే అంశంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను గతంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఆకుల సుజాత శ్రీధర్, నోడల్ అధికారి వి.రమేశ్, డాక్టర్స్ జయశ్రీ, సుస్మిత, సాజిత, శ్రీవాస్తవ్, శ్రీనివాస్, బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు యాదవ్, ఆకుల అంజన్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పున్న గోవర్ధన్, కబీర్ దాస్ తదితరులు పాల్గొన్నారు.