calender_icon.png 18 April, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేటర్లకు కొమ్ముకాస్తూ. .. పేదలపై భారం మోపుతున్న బీజేపీ

09-04-2025 03:49:26 PM

కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం

మునుగోడు,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ పై ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో ధరలు మోపి కార్పొరేటర్లకు కొమ్ముగాసు పేదల పై భారం మోపుతోందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై 50 రూపాయలు, డీజిల్ పెట్రోల్ పై రెండు రూపాయలు, ఎక్సైజ్ టాక్సీ పేరు ధరలు పెంచడాని గ్యాస్ సిలిండర్లు, ప్రకార్లతో నిరసన వ్యక్తం చేసిగ్యాస్ సిలిండర్లు ప్రకార్లతో నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గుళ్ళు, దేవుళ్ళ, అంటూ మతోన్మాదాన్ని పెంచిపోశిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ఉన్నంత వర్గాలకు కొమ్ముకాస్తూ సాధారణ మానవుల ఇబ్బందులకు గురి చేద్దామని ఆలోచన విధానాన్ని తిప్పి కొట్టాలని కార్మికులను పార్టీ శ్రేణులను ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎం పాండు, దుబ్బ వెంకన్న, కురుమర్తి ముత్తయ్య, బండారు శంకర్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య, ఈదులకంటి కైలాస్, కాగిత వెంకన్న, కొంపల్లి రాములు, దాం కాసిం, చందపాక యాదయ్య, శిరగోని మారయ్య, మందుల వెంకన్న, ప్రేమలత, అండాలు, బక్కమ్మ, పూల రాములమ్మ,  దుబ్బ ప్రమోదు, పాలకూరి యాదయ్య పాల్గొన్నారు.